నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి చిత్రానికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీకువీరులు ఈ సినిమా కథ, పాత్రల గురించి ఎప్పటికప్పుడు లీకులు అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ పోషిస్తున్న బాలయ్య ఓ పాత్రలో భాగంగా విలన్ పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్ హాట్ టాపిక్.
ఈ సినిమాలో విలన్ పాత్రను బలంగా రూపొందిస్తున్నారట బోయపాటి. అయితే బాలయ్య వంటి హీరోను ఢీ కొట్టడానికి అవతల కూడా బాలయ్యనే ఉండాలని దర్శకుడు భావిస్తున్నాడట. దర్శకుడి ఆలోచనకు ఈ నందమూరి హీరో కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తల వచ్చాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ నుంచి వచ్చిన అనధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య విలన్‌గా కనిపంచట్లేదట. సినిమా మొదలైన కొన్ని నిమిషాల పాటు నెగటీవ్ షేడ్స్‌లో కనిపిస్తారని కానీ విలన్ కాదని అంటున్నారు.